5.5..5..5(ఖండగతి)
భావాల జల్లులో తడవమని అంటానుభావుకత్వపు గజలు పాడమని అంటాను
ముసుగులో నీ మోము దాచుతా వెందుకో?
ప్రేమయో !ద్వేషమో! చూపమని అంటాను
నినుచూడ మనసంత పూవనిగ మారింది
ప్రేమ జలమును రోజు పోయమని అంటాను
మోహాల సంకెళ్ళు త్రెంచమని అంటాను
గజలునే వ్రాయగా సులభమే అయిననూ
విరుపులే తేవడం కష్టమని అంటాను
గజలుకే అందమ్ము విరుపులే శైలజా
భావాల పరిళము దూయమని అంటాను!!!

No comments:
Post a Comment