కాలాన్ని ఆపగల శక్యమా ఓ చెలీ
గాలమే వేసినా ఆగునానెచ్చెలీ
కష్టాల కడలిలో తీరమే చేరగా
గడియైన విశ్రాంతి దొరుకునా కోమలీ
గడ్డిపోచను కూడ ఊతగా చేకొనీ
సమయమ్ముతోపాటు సాగుమా పైదలీ
అడుగడుగునా వెతలు ఆటంకపరచినా
కడదాక నవ్వుతూ నడువుమా తోయలీ
శైలజగ నీపేరు
చిరముగా నిలువగా
సాహితీ లోకాన మెరియుమా జాబిలీ!!!