ఓ..మది
ఎన్ని ఊహలు ఎన్ని
కోర్కెలు ఎన్ని ఆశలు పూచె నో మది
ఎన్ని ఆటలు ఎన్ని
పాటలు ఎన్ని మాటలు దాచె నోమది
పొద్దు పొడవగ
నిద్దురంతయు బద్దకమ్ముగ వదలి పోవగ
ముద్దు ముద్దుగ
ముంగిలందున పూలబాలల చూచె నోమది
ఏది ఎందుకు
ఇచ్చునో మరి ఎవరి నెందుకు కలుపునో విధి
ఏది శాశ్వత మేది
సత్యము ఏమెరుంగక వేచె నోమది
పంచ మమ్మున పాడుకోయిల
అన్ని ఋతువుల పాడలేదుగ
జీవితమ్మను నావదారిని
వెలుగు చీకటి కాచె నోమది
కాన రానీ బంధనాలే
కాళ్ళకే సంకెలలు వేయగ
శైలజా !నీపాట
లోకపు తీరుతెన్నుల తూచె నోమది.!!!

