సంకీర్ణ గతి... 4-5; 4-5; 4-5; 7
మాయని ప్రేమయే మధురస
కావ్యమూమమతలు పూయించు వరదాయిగా
న్యాయపు మార్గమే నవరస
భరితమూ నవ్వుతు నడిపించు వరదాయిగా
కన్నులు నీకొరకె వెదకును నిత్యమూ ఆశల పొదరింట ననుచేరవా
నామది చల్లగా వెన్నెల జల్లగా మనసే మురిపించు వరదాయిగా
మదిలో మాటలూ పాటగ మారినవి వలపుల రాగమే పలికించవా
ఎంతగ వేచేది ఎన్నని చెప్పేది ప్రియతమ కనిపించు వరదాయిగా
విరహం జ్వాలగా వేదన రేగగా వేణువు నొకసారి మ్రోగించవా
గానము చేరినది గారడి చేసినది తెరలను తొలగించు వరదాయిగా
తారలు శైలజను గేలిగ చూసినవి తమనెలరాజుతో తారాడుచూ
ఎచ్చటనుంటివో ముచ్చట లాడుచూ కరుణే చిలికించు వరదాయిగా!!!

No comments:
Post a Comment