Sailu Gajals
Friday, April 10, 2020
Chupke Chupke Raat Din with lyrics | चुपके चुपके रात दिन गाने के बोल | N...
Chupke Chupke Raat Din with lyrics | चुपके चुपके रात दिन गाने के बोल | N...
Friday, January 31, 2020
Sunday, June 30, 2019
నీవేగా
నా హృదయారాధనలో రూపానివి నీవేగా
నా కవితా మాధురిలో భావానివి నీవేగా
తేనెలొలుకు కనులతో తిలకించేనేస్తమా
నా కలల దారులలో దీపానివి నీవేగా
తొలి చూపుల వలలతో కవ్వించే మౌనమా
నా ఊహల మాలలలో దారానివి నీవేగా
వేధించే అమాసల తోడుండే బంధమా
నా అక్షర గీతానికి లక్ష్యానివి నీవేగా
గాయమైన వెదురులో గానమైన గీతమా
నా వూపిరిలో నిండిన నాదానివి నీవేగా!!!
కలికి
అచ్చ తెలుగు పదమల్లె పలికిందీ ఈకలికి
ముచ్చటైన కవితల్లే నిలిచిందీ ఈకలికి
పచ్చ చీర గట్టినట్టి ప్రకృతిలాగ కనిపిస్తూ
పెళ్ళికూతురల్లె సిగ్గు లొలికిందీ ఈకలికి
తొలివేకువ కిరణంలా నులివెచ్చగ తాకుతూ
ఆమనిలో కోయిలలా పిలిచిందీ ఈ కలికి
వెంటాడే చూపులతో ఊసులేవొ వినిపిస్తూ
మకరందపు బిందువులే చిలికిందీ ఈకలికి
నవ కవితా గానంలో నాయకిలా నర్తిస్తూ
నండూరీ ఎంకిలాగ అలిగిందీ కలికి!!!
వానచినుకులు
నేలతల్లికి
దప్పికంతను దిద్ది వేసెను వానచినుకులె
పూలతీవెకు
కొత్తవన్నెల నద్ది వేసెను వానచినుకులె
ఆకసమ్మున
ధారలన్నియు అంతకంతకు హద్దుమీరెను
కాగితమ్ముల
పడవలన్నియు గుర్తుచేసెను వానచినుకులె
పూలగొడుగును
చేతబట్టుకు నీటిముత్యములేరుతుంటే
నాడు ఆడిన
ఆటలన్నియు రాశిపోసెను
వానచినుకులె
ఆకతాయీ
చల్లగాలులె ఆనవాళ్ళను ఒడిసిపడితే
యవ్వనమ్మున
రాగసుధలను అందజేసెను వానచినుకులె
పచ్చపచ్చని
తరువులన్నియు ప్రణయరాగము లాలపిస్తే
కరిగి పోయిన
కాలమంతయు కనుల నిలిపెను వానచినుకులె
నీలికలువా చందురేడని
కొండకోనా అడుగుతుంటే
వానవిల్లున ప్రేమలేఖను పంపుచుండెను వానచినుకులె!!!
Saturday, June 29, 2019
ఆనందం (1)
1.
ఎండలన్ని తగ్గిపోయి
వానొచ్చిన ఆనందం
ఎండవాన కలిసినపుడు విల్లొచ్చిన ఆనందం
ఆరుబయట వెన్నెలలో నిదురించిన వేళలోన
ఒక్కసారి సొంతఊరు వెళ్ళొచ్చిన ఆనందం.
ఒక్కసారి సొంతఊరు వెళ్ళొచ్చిన ఆనందం.
కన్నవారి కలలు దీర్చు సమయమ్మున కన్నులలో
కష్టపడిన ఫలితానికి గెలుపొచ్చిన ఆనందం.
కష్టపడిన ఫలితానికి గెలుపొచ్చిన ఆనందం.
తిరుమలగిరి కొండపైన వెంకన్నను చూడగానె
నల్లనయ్య మాఇంటికి నడిచొచ్చిన ఆనందం.
నల్లనయ్య మాఇంటికి నడిచొచ్చిన ఆనందం.
చినుకు తడికి చిగురుతొడిగి పూవులన్ని విరబూయగ
ఆతారలు నాచేతికి అందొచ్చిన ఆనందం.
ఆతారలు నాచేతికి అందొచ్చిన ఆనందం.
అస్మదీయులందరినీ అక్షరాల కలియువేళ
విస్మయముగ షేర్లనడుమ విరుపొచ్చిన ఆనందం
విస్మయముగ షేర్లనడుమ విరుపొచ్చిన ఆనందం
పాతతెలుగు పాటలన్ని పరిమళాలె శైలజా
గుండెగొంతులోన కదలి పాటొచ్చిన ఆనందం.
గుండెగొంతులోన కదలి పాటొచ్చిన ఆనందం.
Subscribe to:
Comments (Atom)
-
Chupke Chupke Raat Din with lyrics | चुपके चुपके रात दिन गाने के बोल | N...
-
అచ్చ తెలుగు పదమల్లె పలికిందీ ఈకలికి ముచ్చటైన కవితల్లే నిలిచిందీ ఈకలికి పచ్చ చీర గట్టినట్టి ప్రకృతిలాగ కనిపిస్తూ పెళ్ళికూ...




